వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరగట్టు బన్నీ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని అధికారులు ప్రజలకు సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలూరు మండలం ముద్దనగేరి, కరిడిగుడ్డం గ్రామాల్లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆలూరు తహశీల్దార్ సువర్ణమ్మ, ఎస్ఐ మన్మధ విజయ్ మాట్లాడుతూ.. భక్తులు, గ్రామ ప్రజలు ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా అధికారులకు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

