వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం బక్కుపేట పరిసరాల్లో అటవీ ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పార్వతీపురం, మక్కువ మండలాల పరిధిలో సంచరించిన ఏనుగులు గురువారం సాయంత్రం సీతానగరం మండలంలోకి ప్రవేశించాయి.
బల్ల కృష్ణాపురం మీదుగా బక్కుపేట పరిసరాల్లో కొండ దిగువన చెట్టు నీడన ఏనుగులు సేదతీరుతున్నాయి. స్థానికులు ఎవరూ ఒంటరిగా అటువైపు వెళ్లవద్దని సిబ్బంది సూచించారు.
Comments
Loading comments...

