వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్ నిర్వహించనున్నట్లు ఎస్పీ సంకీర్త్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది.
పోలీసుల విధులు, బాధ్యతలు, ఆయుధాల వినియోగం, ఆధునిక సాంకేతికత, నేర నియంత్రణ, ప్రజల భద్రతలో పోలీసుల పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
Comments
Loading comments...

