వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం పట్టణ నూతన ట్రాఫిక్ ఎస్సైగా పడాల కేశవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన చర్లలో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

