వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ మార్కెట్లో వెండి ధర సెప్టెంబర్ 30 నుంచి దాదాపు రూ.30 వేలు తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర తాజాగా రూ.5,500 తగ్గి రూ.2,02,000కు చేరింది. బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,900 తగ్గి రూ.1,46,100గా నమోదైంది.
డాలరు బలపడటం, ముడి చమురు ధరల పెరుగుదలతో విలువైన లోహాలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. వరుసగా మూడో సెషన్‌లోనూ బంగారం, వెండి ధరలు క్షీణించాయి.
Comments
Loading comments...

