వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి మండలం మూలపాలెం ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అమలాపురం ఈఈ రాంబాబు తెలిపారు. మూలపాలెం, సానపల్లిలంక, పొట్టిలంక, తొత్తరమూడి, కొండుకుదురు, కొండుకుదురులంక గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు.
వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

