Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపల్లి ఎంపీటీసీగా శెట్టిపల్లి శివ నాగరాజు పోటీ

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 11:55 AM తూర్పుగోదావరి General
అనంతపల్లి ఎంపీటీసీగా శెట్టిపల్లి శివ నాగరాజు పోటీ - Udayam
తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శెట్టిపల్లి శివ నాగరాజు నల్లజర్ల మండలం అనంతపల్లి ఎంపీటీసీ-1 స్థానానికి ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నామినేషన్‌కు ముందు అనంతపల్లి సెంటర్‌లోని గణపతి ఆలయంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నల్లజర్ల మండలానికి చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...