వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ అనకాపల్లి జోన్లో ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి తెలిపారు. మొత్తం 89 పోలింగ్ కేంద్రాల్లో 32 సమస్యాత్మక, 20 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ నిర్వహణకు 586 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

