వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా సోన్-కడ్తాల్ వై జంక్షన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున లారీ అంబులెన్స్‌ను ఢీకొట్టడంతో తల్లీకూతుళ్లు సరస్వతి (22), పారూబాయి (50) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అనారోగ్యంతో బాధపడుతున్న సరస్వతిని ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Loading comments...

