Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మాయి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
raju Sep 09, 2026 7:13 PM నిజామాబాద్General
అమ్మాయి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య - Udayam
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వెల్లడించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మరియా తండాలో చోటు చేసుకుంది. మరియ తండాకు చెందిన బానోత్ విజయ్ 22 స్థానికంగా ఓ యువతిని కొన్నాళ్లుగా ప్రేమించాడు. ఆ యువతి విజయ్ తో కాకుండా మరొకరితో పెళ్లికి సిద్ధమైందని వీడియోలో తెలిపాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Comments

G
Loading comments...