వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి అమెరికన్లు అమిష్ షా (48), పియా దాండియా (39) అరిజోనా, ఫ్లోరిడా నుంచి ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్నారు. తాజా అంచనాల్లో వీరిద్దరికీ విజయావకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
‘కుక్ పొలిటికల్ రిపోర్ట్’ షా విజయంపై స్పష్టమైన అంచనా వేయగా, దాండియా పోటీపై అనిశ్చితి ఉందని తెలిపింది. ‘కల్షి’ అంచనాల ప్రకారం షాకు 80%, దాండియాకు 60% విజయావకాశాలున్నాయి.
Comments
Loading comments...

