వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నూర్ నుండి జెడ్డా వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి కన్నూర్‌కు చేరుకుంది. వార్నింగ్ లైట్లు వెలగడంతో అప్రమత్తమైన పైలట్లు, సుమారు 180 మంది ప్రయాణికులతో విమానాన్ని క్షేమంగా ల్యాండ్ చేశారు.
ప్రమాదాన్ని నివారించేందుకు పైలట్లు విమానాన్ని గాలిలో చక్కర్లు కొట్టించి ఇంధనాన్ని ఖర్చు చేశారు. ఇంజిన్ ఫ్యూయల్ ఫిల్టర్‌లో లోపం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

