వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. కన్నేవలస-చీపుర్లపాడు మధ్య జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తిప్పాన రామారావు (54), పార్వతి (47) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆలయాల్లో దర్శనాలు ముగించుకుని బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

