వార్తలకు తిరిగి వెళ్లండి

భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్.కె. ఆడ్వాణీ (98) అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఆడ్వాణీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వయోసంబంధిత సమస్యలతో ఈ ఏడాది మేలోనూ ఆయన ఇదే ఆసుపత్రిలో చేరి, కొన్ని రోజుల తర్వాత డిశ్ఛార్జి అయ్యారు.
Comments
Loading comments...

