వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ మండలం ఆబ్బెందలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శుక్రవారం రాత్రి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చన నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

