Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

31 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్న వ్యక్తి

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 10:00 AM జాతీయంGeneral
బీహార్‌కు చెందిన పింటు యాదవ్ 31 ఏళ్ల తర్వాత తన అసలు కుటుంబాన్ని కలుసుకున్నాడు. 9 ఏళ్ల వయసులో పొరపాటున రైలెక్కి పశ్చిమ బెంగాల్ చేరుకున్న అతన్ని ఓ ముస్లిం కుటుంబం పెంచి ‘అబ్దుల్ జబ్బార్’గా పేరు మార్చింది. సోషల్ మీడియా సాయంతో కుటుంబాన్ని వెతికి సొంతూరుకు చేరుకున్నాడు. కంటిపై గాయాన్ని చూసి తల్లి మీనాదేవి గుర్తుపట్టింది. కుటుంబం అతని భార్యాపిల్లలను కూడా మనస్ఫూర్తిగా అంగీకరించింది.

Comments

G
Loading comments...