Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండె పోటు వచ్చిన... 74 ఏళ్ల వయసులో ప్రపంచస్థాయి పతకం

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 4:36 PM జాతీయంక్రీడలు
గుండె పోటు వచ్చిన... 74 ఏళ్ల వయసులో ప్రపంచస్థాయి పతకం - Udayam
భద్రాచలానికి చెందిన 74 ఏళ్ల రిటైర్డ్‌ ఎస్‌బీఐ అధికారి డీవీ శంకరరావు ప్రపంచ మాస్టర్స్‌ పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించారు. 60 ఏళ్ల వయసులో బైపాస్‌ సర్జరీ చేయించుకున్నా, పట్టుదలతో సాధన చేసి ఈ ఘనత అందుకున్నారు. అమెరికాలోని రెనోలో జరిగిన పోటీల్లో ఆయన సత్తా చాటారు. ప్రపంచ పోటీల కోసం రూ.5 లక్షలకు పైగా ఖర్చును సొంతంగా సమకూర్చుకున్నారు.

Comments

G
Loading comments...