Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

5 శాతంగా నిరుద్యోగ రేటు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 7:10 PM జాతీయంవాణిజ్యం
5 శాతంగా నిరుద్యోగ రేటు - Udayam
దేశంలో సెప్టెంబర్‌లో నిరుద్యోగ రేటు 5 శాతంగా నమోదైంది. ఆగస్టుతో పోలిస్తే మార్పు లేకపోగా, గతేడాది సెప్టెంబర్‌లోని 5.2 శాతంతో పోలిస్తే తగ్గింది. ఈ వివరాలను కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన పీఎల్‌ఎఫ్‌ఎస్‌ నివేదిక వెల్లడించింది. పురుషుల్లో నిరుద్యోగ రేటు 4.9 శాతంగా స్థిరంగా ఉండగా, మహిళల్లో 5.1 నుంచి 5.2 శాతానికి పెరిగింది. పట్టణ మహిళల్లో నిరుద్యోగం 8.9 నుంచి 9.2 శాతానికి చేరింది.

Comments

G
Loading comments...