Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 ఏళ్ల తర్వాత తిప్పాపూర్‌కు ఆర్టీసీ బస్సు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 10:24 AM కామరెడ్డిGeneral
17 ఏళ్ల తర్వాత తిప్పాపూర్‌కు ఆర్టీసీ బస్సు - Udayam
బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి 17 ఏళ్ల తర్వాత శుక్రవారం ఆర్టీసీ బస్సు సేవలు పునఃప్రారంభమయ్యాయి. గ్రామానికి చేరుకున్న బస్సుకు ఉపసర్పంచ్ జీవన్ స్వాగతం పలికి డ్రైవర్, కండక్టర్‌లను సన్మానించారు. ఈ నెల 20న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బస్సును లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు మహిపాల్ పాల్గొన్నారు. శుక్రవారం నుంచి గ్రామస్థులకు బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Comments

G
Loading comments...